: 'ప్రియాంక చోప్రాతో నన్ను పోల్చకండి' అంటున్న దీపికా పదుకొణె


హాలీవుడ్‌లోనూ న‌టిస్తూ బిజీబిజీగా ఉన్న బాలీవుడ్ భామ‌లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణెల మ‌ధ్య పోటీ అంటూ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. దీపికా న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘ట్రిప్లెక్స్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. మ‌రోవైపు ప్రియాంక హాలీవుడ్‌లో న‌టిస్తోన్న ‘బేవాచ్‌’ చిత్రం ఈ ఏడాది మేలో విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రినీ మీడియా పోల్చుతూ చూడ‌డం ప‌ట్ల దీపికా ప‌దుకొణె స్పందించింది. ప్రియాంకతో తనను పోల్చడం చాలా వింతగా అనిపించిందని ఈ భామ పేర్కొంది. వ్యక్తిగతంగా ప్రియాంకను ఎవరితోనైనా పోల్చడం సరైనదేనని తెలిపిన దీపికా వృత్తిపరంగా మాత్రం త‌మ ఇద్ద‌రి ప్రపంచాలు విభిన్నమైనవని చెప్పింది.

ప్రియాంక చోప్రా ఆమె కెరీర్‌లో ఏం సాధించాలనుకుందో, అందు కోసం ఎలా కృషి చేస్తోందో అది తన పనికి పూర్తి విభిన్నం అని దీపికా చెప్పింది. అలాగే తనతోపాటు చిత్ర పరిశ్రమకు వచ్చిన సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మలాంటి వారితో త‌న‌ను పోల్చడం ఒక విధంగా సబబని చెప్పింది. అంతేకానీ,  ప్రియాంకతో త‌న‌ను పోల్చ‌డం సరికాదని తెలిపింది.

  • Loading...

More Telugu News