: తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భావం.. ఆర్కేనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తామని వెల్లడి


త‌మిళ‌నాడులో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ ఆవిర్భ‌వించింది. ఇటీవ‌లే చెన్నై మెరీనా బీచ్ వ‌ద్ద జ‌ల్లిక‌ట్టు క్రీడ కోసం పోరాటం చేసి ఆర్డినెన్స్ సాధించిన జ‌ల్లిక‌ట్టు పోరాట యువ‌త ‘ఎన దేశం ఎన ఉరుమై’ (నా దేశం నా హక్కు) పేరుతో రాజ‌కీయ‌ పార్టీ నెల‌కొల్పింది. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీలోని యువ‌త మాట్లాడుతూ.. తమ పార్టీలో కుల, మతాలకు తావులేదని చెప్పారు. కలలు కనండి సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ కలామ్ ఆశయాలకు అనుగుణంగా త‌మ పార్టీ ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. తాము అవినీతి రహిత సమాజ నిర్మాణ‌మే ధ్యేయంగా ఈ పార్టీని స్థాపించామ‌ని చెప్పారు. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జయల‌లిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ నుంచి తమ అభ్యర్థిని పోటీ చేయిస్తామని వారు తెలిపారు. రాష్ట్ర‌ యువతే తమ పార్టీ ప్రతిబింబంగా ఉంటుందని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News