: నారా లోకేశ్ త్వరలోనే ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెడతారు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి


విజయవాడలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ... తాము ఈ స‌మావేశంలో 17 అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. టీడీపీ యువ‌నేత‌ నారా లోకేశ్‌ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించామని ఆయ‌న చెప్పారు. లోకేశ్ త్వరలోనే ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టనున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. అన్ని కార్పోరేషన్లలోనూ తొలిదశ ఎన్టీఆర్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామ‌ని, స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థ పునరుద్ధరణపై కేంద్ర స‌ర్కారుని కోర‌తామ‌ని ఆయ‌న అన్నారు. ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయానికి తాము మద్దతిస్తామ‌ని పేర్కొన్నారు. అలాగే తెలుగు భాష అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అనాథల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తాము ఈ స‌మావేశంలో చర్చించిన‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News