: తాబేలు మాంసం తిన్న కుటుంబం.. ఇద్దరి మృతి.. ఒక‌రి ప‌రిస్థితి విష‌మం


తాబేలు మాంసం తిని తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందిన ఘ‌ట‌న పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో నివాసం ఉండే సోయం సత్యనారాయణ కుటుంబం నిన్న రాత్రి తాబేలు మాంసం తిని తీవ్ర అస్వస్థతకు గురికాగా, వారిని జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆసుప‌త్రికి తరలించారు. అయితే, ఆసుప‌త్రికి తీసుకెళ్లేలోపే సత్యనారాయణ ప్రాణాలు కోల్పోయాడు.

అనంత‌రం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ అతడి భార్య దుర్గమ్మ మృతి చెందింది. వారి కుమారుడు మధు ఆరోగ్య‌ పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. సదరు కుటుంబ సభ్యులు నిల్వ ఉన్న మాంసం తిన్నారా? లేదా వారు తిన్న‌ ఆహారంలో ఎవరైనా విష ప్రయోగం చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News