: నూతన అసెంబ్లీ భవన ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు
విజయవాడలో కొనసాగుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడేవారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ యువనేత నారా లోకేశ్‌ను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా సీఎంను కోరింది. అలాగే అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవన ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 2 ఉదయం 11.25కు ఆ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.