: తీవ్ర విషాదం... వాషింగ్‌ మిషన్ లో పడి కవలల మృతి


ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వాషింగ్‌ మిషన్ లో పడి రెండున్నరేళ్ల వయస్సు కల్గిన ఇద్దరు కవలలు నిశాంత్, నక్షయ ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రవీందర్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయ‌న భార్య బట్టలు ఉతికేందుకు వాషింగ్‌ మిషన్ లో నీళ్లు నింపింది. ఈ క్ర‌మంలోనే వాషింగ్ పౌడ‌ర్ కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్లింది. అయితే, వాషింగ్‌ మిషన్ దగ్గరే ఆడుకుంటున్న వాళ్ల‌ పిల్లలు అందులో ప‌డిపోయారు. ర‌వీంద‌ర్ భార్య షాపు నుంచి తిరిగొచ్చేసరికి పిల్లలిద్దరూ కలిపించక‌పోవ‌డంతో కంగారు ప‌డింది. దీంతో ఇరుగుపొరుగు వారు పిల్ల‌లు క‌నిపించ‌డం లేద‌ని పోలీసులకు సమాచారం అందించారు.

మ‌రోవైపు ఈ స‌మాచారం అందుకున్న ఆ పిల్ల‌ల తండ్రి ర‌వీంద‌ర్‌ ఆఫీసు నుంచి హుటాహుటిన వ‌చ్చారు. ఇంత‌లో ఆ చిన్నారులిద్దరూ వాషింగ్‌ మిషన్ లో తేలియాడుతూ కనిపించారు. వారిని దగ్గరలోని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే ఆ పిల్ల‌లు ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News