: అరుణ్ జైట్లీ బ్యాంకు, ట్యాక్స్ వివరాలు చెప్పాల్సిందే : హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్


ఢిల్లీ క్రికెట్ బాడీ డీడీసీఏకు అధినేతగా ఉన్నప్పుడు అరుణ్‌ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని గ‌తంలో ఢిల్లీ సీఎం అర‌వింద్‌ కేజ్రీవాల్ ఆరోపించ‌డంతో ఆయ‌న‌ ఆరోపణల వ‌ల్ల‌ తనకు పరువునష్టం కలిగిందని జైట్లీ  పరువునష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే. అయితే, కేజ్రీవాల్ ఈ అంశంపై వెనక్కు తగ్గడం లేదు. తాజాగా అరుణ్ జైట్లీ ఆస్తుల విష‌య‌మై కేజ్రీ ఢిల్లీ హైకోర్టుకెక్కారు. జైట్లీ బ్యాంకు, ఆదాయపు పన్ను వివరాలను బహిర్గతం చేయాలని ఆయ‌న న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జైట్లీ పేరుపై ఉన్న‌ ఆస్తుల వివ‌రాల‌తో పాటు ఆయ‌న భార్య‌, కూతురు, అల్లుడికి సంబంధించి 1999-2014 వరకున్న బ్యాంకు వివరాలన్నింటినీ ఇవ్వాల‌ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. తను ఎలాంటి వ్యక్తిగత ఆర్థిక లబ్దికి పాల్పడలేదని జైట్లీ నిరూపించుకోవాలంటే తాను కోరిన‌ డాక్యుమెంట్లు అన్నీ అవసరమని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ వేసిన పిటిష‌న్‌ను ఢిల్లీ హైకోర్టు వ‌చ్చేనెల‌ 6,7 తేదీల్లో విచారించనుంది.

  • Loading...

More Telugu News