: సంచలనం కలిగిస్తున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కామ్... 18 మంది అరెస్ట్
సంచలనం కలిగిస్తున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కాములో భాగంగా, ముందుగానే క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన కేసులో పలు నగరాల్లో దాడులు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గోవా, నాగపూర్, థానే, నాసిక్ ప్రాంతాల్లో సోదాలు జరిపిన పోలీసులు, ఇప్పటివరకూ 18 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పరీక్షకు ముందే కొంతమందికి పేపర్ చేరగా, వారు ముందురోజే దాన్ని రాసినట్టు సమాచారం అందుకున్న పోలీసులు 350 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, ఈ దాడులు జరిపారు. ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో ఆర్మీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉండి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. థానే సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదుకాగా, థానే క్రైమ్ బ్రాంచ్ డీసీపీ పరాగ్ మనేరే కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.