: రిజర్వేషన్లు మేం అడిగామా? ఇప్పుడు పిచ్చి కోపం చూపిస్తే ఊరుకుంటామా?: చంద్రబాబుపై ముద్రగడ నిప్పులు


కాపులకు రిజర్వేషన్లు కావాలని తాము అడగలేదని, ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తూ, హామీలను అమలు చేయాలని కోరుతుంటే, చంద్రబాబు కోపాన్ని ప్రదర్శిస్తున్నారని ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. కర్నూలులో సత్యాగ్రహ దీక్షను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గురించి మాట్లాడుతుంటే, పిచ్చి కోపం చూపుతున్న చంద్రబాబును ఊరికే వదిలిపెట్టబోమని అన్నారు. తాను ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నానని చెప్పిన ముద్రగడ, హామీలిచ్చి మోసం చేయడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. కుర్చీలో కూర్చున్నాక ఆయనకు కోపం వస్తోందని, ఇది పదవికే చేటు తెస్తుందన్న విషయాన్ని ఆయన మరచిపోయారని విమర్శించారు. రిజర్వేషన్ల కోసం కాపులంతా ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చారని, వచ్చే ఎన్నికల్లో ఐకమత్యంగా సత్తా చాటుతామని అన్నారు.

  • Loading...

More Telugu News