: ఉన్న 31 సీట్లతోనే ముంబై మేయర్ సీటుకు టెండరేస్తున్న కాంగ్రెస్!


ముంబై నగరపాలక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని తరుణంలో, మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ సైతం భావిస్తోంది. 227 మంది సభ్యులున్న ముంబై కార్పొరేషన్ లో, శివసేనకు 84, బీజేపీకి 82, కాంగ్రెస్ కు 31 సీట్లు లభించిన సంగతి తెలిసిందే. గెలిచిన ఇండిపెండెంట్లలో ఇప్పటికే నలుగురు శివసేనకు మద్దతిచ్చారు. దీంతో ఆ పార్టీ బలం 88కి పెరిగినప్పటికీ, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేంత మెజారిటీ లేదు.

ఇదే సమయంలో శివసేనకు మద్దతిచ్చేందుకు బీజేపీ, బీజేపీ అభ్యర్థికి జై కొట్టేందుకు శివసేన సుముఖంగా లేకపోవడంతో, మిగతా చిన్న పార్టీలతో కలసి మేయర్ పీఠానికి నామినేషన్ వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ముంబై చీఫ్ సంజయ్ నిరుపమ్ తెలిపారు. తమకు గెలిచే అవకాశాలు లేవన్న సంగతి తెలుసని, ఇదే సమయంలో ఇతర పార్టీలకు ఆ అవకాశాన్ని అంత సులువుగా మాత్రం దక్కనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. శివసేనకు తాము మద్దతివ్వబోమని వెల్లడించిన ఆయన, బీజేపీతో ఆ పార్టీ అనైతిక బంధాన్ని కలుపుకుని మేయర్ పీఠాన్ని పంచుకోవాలని భావిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News