: హైదరాబాద్ లో ప్రారంభమైన ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్


తెలంగాణలోని పరీక్షా కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో చోటు కావాలని భావిస్తున్న గ్రూప్-2 అభ్యర్థుల స్క్రీనింగ్ టెస్ట్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ పరీక్ష జరగనుండగా, నిబంధనల మేరకు ఉదయం 9:45 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసి వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష కోసం 1462 కేంద్రాలను ఏర్పాటు చేయగా, తెలంగాణలో 86 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 6,57,010 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డు ఒరిజినల్ తేవడం తప్పనిసరికాగా, గుర్తింపు కార్డు లేకుండా వచ్చిన వారిని పలు కేంద్రాల్లో వెనక్కు పంపడంతో, వారు వాపోవాల్సిన పరిస్థితి కనిపించింది.

  • Loading...

More Telugu News