: చేసిన నేరానికి పదేళ్ల తరువాత యూఎస్ లో ప్రవాస భారత వ్యాపారి అరెస్ట్


బ్యాంకులను మోసం చేసిన కేసులో భారత సంతతికి చెందిన వ్యాపారి హాండాను వాషింగ్టన్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం బోస్టన్ కు తరలించారు. బోస్టన్ లో ఆల్ఫా ఒమేగా జువెలర్స్ పేరిట ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తున్న హాండా, వ్యాపారంలో నష్టం రావడంతో బ్యాంకులను ఆశ్రయించి రుణాలు పొందాడు. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమై, డిసెంబర్ 2007లో అమెరికా నుంచి పలాయనం చిత్తగించాడు. తిరిగి పదేళ్ల తరువాత, అమెరికాలో కాలుపెట్టాడు. లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో హాండాను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం రూ. 46 కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకులకు ఎగవేసినట్టు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈ కేసులో హాండాకు 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఎఫ్బీఐ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News