: ఎన్నికల బరిలోకి దిగుతున్నా: స్పష్టం చేసిన నటుడు సుమన్
బడుగులకు సేవ చేయడమే లక్ష్యంగా 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు సినీ నటుడు సుమన్ స్పష్టం చేశారు. విశాఖ నగర బీసీ యువజన సంఘం తనను సన్మానించిన సందర్భంగా సుమన్ మాట్లాడారు. రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతోనే గత కొంత కాలంగా వెనుకబడిన తరగతుల వారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. నటుడిగా ఉంటే కొంత మందికి మాత్రమే సేవ చేసే అవకాశం ఉంటుందని, రాజకీయ బలం తోడైతే, మరింత మందికి సాయపడగలనన్న నమ్మకం తనకుందని అన్నారు. తనకు కొన్ని లక్ష్యాలున్నాయని, వాటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చిన పార్టీ తరఫున బరిలోకి దిగుతానని అన్నారు.