: ఢిల్లీ యూనివర్శిటీ డిగ్రీ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి... విద్యార్థుల ఆందోళ‌న‌


ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థినిపై ప‌లువురు యువ‌కులు అఘాయిత్యానికి పాల్ప‌డ‌డంతో ఈ రోజు విద్యార్థులు ఆందోళ‌న చేశారు. బీఏ రెండో సంవత్సరం విద్యార్థిని అయిన ఓ యువ‌తి నిన్న తన‌తో పాటు చ‌దువుకునే స్నేహితుడి ఇంటికి వెళ్లింది. అక్క‌డ‌ ఆమె క్లాస్‌మేట్, అతని స్నేహితులు ఆమెకు మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్ ఇచ్చారు. అనంత‌రం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన‌ విద్యార్థినిపై నలుగురూ అత్యాచారం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు నలుగురు యువ‌కులని అరెస్టు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News