: బాహుబలి వీఆర్ ఎక్స్‌పీరియెన్స్ టీజర్ ను చూసిన చంద్రబాబు.. టీమ్ కు అభినందనలు!


యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్ న‌టించిన బాహుబలి 2 సినిమా ఏప్రిల్ 28వ తేదీన విడుదల కావ‌డానికి ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై ‘ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి టీజర్’ ను ఆ చిత్రం యూనిట్ చూపిస్తోంది. అందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాహుబలి వీఆర్ ఎక్స్‌పీరియెన్స్ టీజర్ చూశారు. విర్చువల్ రియాలీటీలో బాహుబలి టీజర్ చూసిన త‌రువాత త‌మ‌ను చంద్రబాబు చంద్ర‌బాబు నాయుడు అభినందించార‌ని బాహుబలి వీఆర్ ట్విటర్ ఖాతాలో తెలిపారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు టీజ‌ర్ చూస్తుండ‌గా తీసిన వీడియోను పోస్ట్ చేశారు.



  • Loading...

More Telugu News