: నగలన్నీ మూటగట్టుకొని పారిపోయిన కొత్త పెళ్లికూతురు!
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా నజిరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరోజనీనగర్‌కు చెందిన శ్యాంబాబు అనే యువకుడు గురువారం దేవరియా గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుదామని అనుకున్నాడు. అయితే, ఎన్నో కలలుగన్న శ్యాంబాబు జీవితం మళ్లీ యూ టర్న్ తీసుకుంది. ఆ యువతికి శ్యాంబాబు మూడు ముళ్లు వేసిన అదే రోజు బంగారు నగలన్నింటినీ తీసుకుని పారిపోయింది ఆ వధువు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వధూ వరులకు చెందిన రూ.2.50 లక్షలు మాయమయ్యాయని, వధువు సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని చెప్పారు.