: 'రింగింగ్ బెల్స్' డైరెక్టర్ ఎనిమిదో తరగతి కూడా పాస్ కాలేదట!


రూ.251కే స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ గొప్పలు చెప్పిన 'రింగింగ్ బెల్స్' డైరెక్టర్ మోహిత్ గోయల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. రూ.16లక్షల మేర రింగింగ్‌ బెల్స్‌ సంస్థ తమకు చెల్లించాలంటూ ఆయామ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేసిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అత‌డి నుంచి ప‌లు నిజాల‌ను రాబ‌ట్టారు. రింగింగ్‌ బెల్స్‌కు చెందిన లింక్డ్‌ఇన్‌ వెబ్‌సైట్‌లో మోహిత్‌.. తాను అమిటీ యూనివర్శిటీలో ఎంబీఏ చేశానని పేర్కొన్నాడు. అయితే, తాను చదివింది కేవలం ఎనిమిదో తరగతేన‌ని, అది కూడా పాసవ్వలేదని  మోహిత్‌ పోలీస్ విచారణలో చెప్పాడు. తాను ఇంగ్లిషులో మాట్లాడేందుకు ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ కోర్స్‌ చేశానని పేర్కొన్నాడు. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News