: తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలలో స్వల్ప మార్పులు!


తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వ‌చ్చేనెల‌ 17వ తేదీన ఎన్నికలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నికల కమిషన్ ఇటీవ‌లే ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ పోలింగ్‌కు సంబంధించి స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పోలింగ్‌ను వచ్చే నెల‌ 20వ తేదీన‌ నిర్వహించనున్నట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున‌ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ఎన్నిక‌ల‌ కమిషన్ విడుదల చేసింది. ఈమేరకు ఈ నెల‌ 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 7 వరకు నామినేషన్ల స్వీకరణ, 8న పరిశీలన, 10న ఉపసంహరణకు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు.

  • Loading...

More Telugu News