: ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎవరెవరు నీ ఇంటికి సూట్ కేసులు తెస్తున్నారో అందరికీ తెలుసు: కేసీఆర్ పై కాంగ్రెస్ ధ్వజం


30 నెలల కాలంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనడం మినహా చేసిందేమీ లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మల్లు రవిలు మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు. ఏయే ఆంధ్ర కాంట్రాక్టర్ నీ ఇంటికి సూట్ కేసులు మోసుకొస్తున్నాడో అందరికీ తెలుసని అన్నారు. ఎవడబ్బ సొమ్మని తిరుమల వెంకన్నకు కోట్లాది రూపాయల కానుకలు సమర్పించారని ధ్వజమెత్తారు. మీ మొక్కులు మీ ఇష్టమని... పేదలు కట్టిన సొమ్ముతో దేవుళ్లకు కానుకలు సమర్పిస్తారా? అంటూ మండిపడ్డారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణ పాలిట ఓ బందిపోటు ముఠాలా తయారయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అప్పులు తెచ్చుకోవడం, కమిషన్లను తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కూర్చున్న ముఖ్యమంత్రి కుర్చీ కాంగ్రెస్ పుణ్యమే అని అన్నారు. కేసీఆర్ కు అహంకారం పెరిగిందని... దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News