: బాహుబలి-2లో అనుష్క లుక్... ఫస్ట్ లుక్ లో కనిపించినంత గ్లామరస్ గానే ఉంటుంది: రాజమౌళి


శివరాత్రి సందర్భంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో బాహుబ‌లి 2లో అనుష్క లుక్ పై ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి స్ప‌ష్ట‌తనిచ్చారు. బాహుబ‌లి పార్ట్ 1లో అనుష్క ఒకేఒక చీరలో క‌థ మొత్తం క‌నిపించిన విష‌యం తెలిసిందే. అనుష్క గ్లామరస్ లుక్ కోసం ప్ర‌స్తుతం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి పార్ట్‌1లో భ‌ల్లాల దేవుడి రాజ్యంలో బందీగా ఆమె క‌నిపించగా రెండో పార్ట్‌లోన‌యినా అనుష్క గ్లామరస్ లుక్‌లో ద‌ర్శ‌మిస్తే బాగుండున‌ని ఆ అమ్మ‌డి అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాజ‌మౌళి స్పందిస్తూ..  రెండో భాగంలో అనుష్క కనిపించే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో అయిపోయింద‌ని చెప్పారు. ఇటీవల జరిగిన షూటింగ్ లో కొన్ని షాట్స్ మాత్రమే చిత్రీకరించామని చెప్పారు. బాహుబ‌లి 2లో అనుష్క లుక్ ఫస్ట్ లుక్ లో కనిపించినంత గ్లామరస్ గానే ఉంటుందని చెప్పి, ఆ అమ్మ‌డి అభిమానుల‌ను ఖుషీ చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News