: కొన్ని రోజులుగా నియోజకవర్గంలో జరిగిన విషయాలపై కలత చెందా: స్థానిక నేతలతో బాలకృష్ణ


టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. బాలయ్య పీఏ శేఖర్ ను సాగనంపాలని ఒక వర్గం... అతన్నే కొనసాగించాలని మరో వర్గం పట్టుబట్టడంతో... నియోజకవర్గంలో అలజడి చెలరేగింది. ఈ నేపథ్యంలో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణలతో నిన్న ఫోన్ లో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాలపై తాను చాలా కలత చెందానని ఈ సందర్భంగా బాలయ్య వారితో అన్నారు. ఇది ఒక కుటుంబ సమస్యలాంటిదని... అందరం కలిసి చర్చించుకుని, సమస్యను పరిష్కరించుకుందామని ఆయన తెలిపారు.

ఇకపై అందరూ విభేదాలను పక్కన పెట్టి, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిద్దామని బాలయ్య సూచించారు. అంతేకాదు, ఈ నెల 28న అందరూ హైదరాబాదుకు రావాలని... ఇక్కడ కూర్చుని అందరం చర్చిద్దామని పిలిచారు. పీఏ శేఖర్ వల్ల నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలే ప్రమాదం ఏర్పడటంతో... పార్టీ ప్రతినిధిగా హిందూపురంకు వచ్చిన కృష్ణమూర్తి, స్థానిక నేతలతో మాట్లాడి, బాలయ్యకు ఓ నివేదిక అందించారు. ఈ నేపథ్యంలోనే నేతలందరినీ హైదరాబాదుకు రావాలంటూ బాలయ్య పిలిచారు.

  • Loading...

More Telugu News