: సెంచరీతో సత్తా చాటిన స్మిత్.... కాసేపటికే పెవిలియన్ కు పంపిన జడేజా


ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో సత్తాచాటాడు. ఆసీస్, టీమిండియా బ్యాట్స్ మన్ పెవిలియన్ కి క్యూకట్టిన చోట... తొలి ఇన్నింగ్స్ లో కేవలం 27 పరుగుల స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో నిరాశ చెందిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్ లో సత్తా చూపించాడు. సహచరులు వెనుదిరుగుతున్నా తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టు నిలకడను ప్రదర్శించాడు. మిచెల్ మార్ష్ (31), రెన్ షా (31), కోంబ్ (19), మాధ్యూ వేడ్ (20), మిచెల్ స్టార్క్ (19) సాయంతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

ఈ క్రమంలో భారత బౌలర్లను ఏమాత్రం లెక్క చేయకుండా సెంచరీ చేశాడు. అయితే కాసేపటికి రవీంద్ర జడేజా సంధించిన బంధికి స్టీవ్ స్మిత్ (109) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 77 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. భారీ షాట్లు ఆడుతున్న మిచెల్ స్టార్క్ (30) అవుట్ కాగా, ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో ఒకీఫ్ (0) కు జతగా నాథన్ లియాన్ (0) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు, జడేజా రెండు, ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు.

  • Loading...

More Telugu News