: ఎట్టకేలకు వికెట్ తీసిన భారత బౌలర్!
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఒకీఫే అద్భుతంగా రాణించిన చోట టీమిండియా స్టార్ స్పిన్నర్లు పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. భారత స్పిన్నర్ల ఆనుపానులు పట్టేసిన ఆసీస్ బ్యాట్స్ మన్ క్రీజులో పాతుకుపోయారు. దీంతో వారిని విడదీసేందుకు వేసిన పాచికలేవీ పారడం లేదు. పేసర్లు, స్పిన్నర్లు ఇలా ఏ అస్త్రాన్ని వాడినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆసీస్ కెప్టెన్ స్వేచ్ఛగా బ్యాటు ఝళిపించాడు. దీంతో నిన్న అర్ధ సెంచరీతో రాణించిన స్మిత్ నేడు సెంచరీకి చేరువయ్యాడు.
నిన్న క్రీజులో స్మిత్ కు అండగా నిలిచిన మిచెల్ మార్ష్ 31 పరుగులు చేసి, 260 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 65 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 3, ఉమేష్ యాదవ్, జడేజా చెరో వికెట్ తీసి ఆకట్టున్నారు.