: మన వారిపై వరుస దాడులు ఆవేదన కలిగిస్తున్నాయి: కేటీఆర్
అమెరికాలో జరుగుతున్న జాతి వివక్ష దాడులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. అక్కడ మన వారిపై జరుగుతున్న వరుస దాడులతో షాక్ కు గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. జరుగుతున్న ఘటనలు ఎంతో ఆవేదనను కలిగిస్తున్నాయని చెప్పారు. గన నెలలో వంశీ... ఇప్పుడు శ్రీనివాస్, అలోక్ లపై జరిగిన దాడులు నివ్వెరపరుస్తున్నాయని తెలిపారు. బాధితులకు సాయం చేసే క్రమంలో భారత విదేశాంగ శాఖతో కలసి పని చేస్తామని చెప్పారు.