: శ్రీనివాస్ హత్యపై స్పందించకపోగా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్!


అమెరికాలో విదేశీయులపై జాతి వివక్ష దాడులు జరుగుతున్నా... తూటాలు పేలుతున్నా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదు. యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ దుర్మరణం పాలైన తర్వాత ఆయన నోటి నుంచి మరింత దురుసు వ్యాఖ్యలు వచ్చాయి. కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ట్రంప్... అమెరికా పౌరుల రక్షణ కోసం పాటుపడతానని, అమెరికన్లకే ఉద్యోగాలను కల్పిస్తామని మరోసారి చెప్పారు. తాను కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడినని... ప్రపంచం మొత్తానికి కాదని స్పష్టం చేశారు. ఒక్కో దేశానికి ఒక్కో జెండా, ఒక్కో జాతీయగీతం, ఒక్కో కరెన్సీ ఉంటాయని చెప్పారు.

శ్రీనివాస్ మృతి పట్ల ట్రంప్ ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. అయితే గత కొంత కాలంగా షికాగో ప్రాంతంలో చోటు చేసుకున్న తుపాకీ కాల్పుల్లో ఏడుగురు చనిపోవడంపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. వారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. షికాగోకు ఇప్పుడు సహాయం అవసరం అని చెప్పారు. ట్రంప్ వ్యవహారశైలి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

  • Loading...

More Telugu News