: ప్రధాని రాకను నిరసిస్తూ 'కర్ఫ్యూ' విధించిన తిరుగుబాటు సంస్థలు!


సాధారణంగా ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు చెలరేగితే పోలీసులు కర్ఫ్యూ విధిస్తుంటారు. అయితే, మణిపూర్ లో  ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు సంస్థలు కర్ఫ్యూ విధించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే, ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లనున్నారు. ఇంఫాల్ సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను నిరసిస్తూ ఆరు తిరుగుబాటు సంస్థల సమన్వయ కమిటీ ప్రధాని పర్యటించనున్న ప్రాంతంలో బంద్ ను ప్రకటిస్తూ కర్ఫ్యూ విధించింది. దీంతో అక్కడ కలకలం రేగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ గట్టిప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మణిపూర్ లో విజయం సాధించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News