: అమ్మ ఆకాంక్ష మేరకు పనిచేద్దాం: పన్నీర్ సెల్వం


అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరిణామాలపై ధర్మయుద్ధం కొనసాగుతుందని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు. జయలలిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన మద్దతుదారులతో వివిధ కార్యక్రమాలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ, సాక్షాత్తు పురచ్చితలైవి గతంలో పార్టీకి, ప్రభుత్వానికి, ఇంటికి దూరంగా ఉంచినవారి చేతిలో ఇప్పుడు అధికారంతో పాటు పార్టీ కూడా బందీ అయిందని విమర్శించారు.

అందుకే పార్టీ పగ్గాలతో పాటు, ప్రభుత్వ పాలన అన్నాడీఎంకే సాధారణ కార్యకర్త చేతికి వచ్చేంత వరకు తమ ధర్మయుద్ధం కొనసాగుతుందని ఆయన తెలిపారు. గతంలో పలువురు రాజకీయనాయకులు ఆడంబరంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం చూసిన జయలలిత... తన పుట్టిన రోజున తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు తన నివాసానికి ఎవరూ రావద్దని, అదే సమయంలో పేదలకు సహాయం చేయాలని సూచించారని గుర్తుచేశారు. ఆమె ఆశయ సాధనకు కొనసాగుదామని ఆయన పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News