: కొలతలవీ తీసుకెళ్లారు... ఖర్చు మనది కాదు!: తన మైనపు బొమ్మ గురించి ప్రభాస్


మేడమ్ టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియంలో 'బాహుబలి' విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని ప్రభాస్ తెలిపాడు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సౌతిండియన్ సినీ నటుల్లో మొట్టమొదట తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, మేడమ్ టుస్సాడ్ మ్యూజియం వారికి మైనం బాగా ఖర్చవుతుందన్న మాట? అంటూ ఇంటర్వ్యూ చేస్తున్న సుమ ప్రశ్నించింది. డానికి ప్రభాస్ స్పందిస్తూ, 'మేడమ్ టుస్సాడ్ మ్యూజియం వాళ్లయితే కొలతలు తీసుకుని వెళ్లారు. మరి మైనం ఎంత ఖర్చవుతుందో తెలీదు... ఖర్చంతా వాళ్లదే కదా, మనది కాదు కదా?' అంటూ నవ్వేశాడు.  

మేడమ్ టుస్సాడ్ మ్యూజియం వాళ్లు తన మైనపు విగ్రహం పెడతారన్న విషయాన్ని ముందుగా తన స్నేహితుడు చెప్పాడని తెలిపాడు. తన స్నేహితుడు గబగబా మాట్లాడేస్తాడని, దానికి ఆనందం కూడా తోడవడంతో వాడేం చెబుతున్నాడో మొదట తనకు అర్థం కాలేదని, దాంతో వాడు మూడు సార్లు చెప్పాల్సి వచ్చిందని ప్రభాస్ తెలిపాడు. అయితే తన స్నేహితుడు చెప్పింది విన్న తరువాత తనకు కూడా చాలా ఆనందం వేసిందని అన్నాడు. 'సూపర్ మేన్', 'స్పైడర్ మేన్', 'ఐరన్ మేన్' వంటి సూపర్ హీరోస్ సరసన 'బాహుబలి' మైనపు విగ్రహం గ్రేట్... ఆ ఫీలింగ్ బావుంది కదా? అన్నాడు ప్రభాస్.

  • Loading...

More Telugu News