: కోయంబత్తూరులో మహాశివుడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని


తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీకి చెందిన కీలక నేతలు కొలువుదీరారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈశా యోగ కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో ఆదియోగి పేరిట 112 అడుగుల భారీ మహాశివుడి ముఖ లోహ విగ్రహాన్ని వెల్లియంగిరి కొండల్లో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహం, పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన మహాయజ్ఞాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ సీహెచ్. విద్యాసాగరరావు, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News