: కొత్త పార్టీ ప్రకటించిన దీప... జయలలితకు వారసురాలిని తానేనంటూ ప్రకటన
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీ ప్రకటించారు. ఈ కొత్త రాజకీయ పార్టీకి 'ఎంజీఆర్ అమ్మ దీప పెరవై' అని పేరు పెట్టారు. ఈ మేరకు పార్టీ లోగోను ఆమె ఆవిష్కరించారు. ఈ లోగోలో ఎంజీఆర్, జయలలిత ఫోటోలు ఉంచడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జయలలిత నిజమైన వారసురాలిని తానేనని ప్రకటించారు. తాను తన అత్తమ్మ పోటీ చేసిన ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. తన అత్తలా పేదలకు సేవచేయడమే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు. తన వెంట చాలా మంది ఉన్నారని ఆమె చెప్పారు. అమ్మ ఆశయసాధనే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ద్రోహులను తరిమికొడతానని ఆమె ప్రకటించారు. పన్నీరు సెల్వంతో కలిసి పని చేయడంపై ఆలోచిస్తానని ఆమె తెలిపారు.