: ప్రధాని మోదీని కలుస్తా: పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని తెలిపారు. ఈ వివాదంపై త్వరలోనే ప్రధాని మోదీని కలిసి, చర్చిస్తానని చెప్పారు.
మరోవైపు దివంగత జయలలిత మృతి వెనుక ఎలాంటి రహస్యాలు లేవని పళనిస్వామి అన్నారు. కొంతమంది ఈ అంశాన్ని పనిగట్టుకుని వివాదాంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరవు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఐదు రోజుల్లోగా నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.