: భారత్ ను విస్మరించి చైనా పెద్ద తప్పు చేసింది: చైనా ప్రభుత్వ రంగ మీడియా
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, ప్రపంచ రికార్డును నెలకొల్పిన నాటి నుంచి... బీజింగ్ మీడియా ఇస్రోను పొగుడుతూనే ఉంది. ఇదే సమయంలో తమ దేశానికి చురకలంటిస్తోంది. భారత్ కు చెందిన సైన్సు, టెక్నాలజీని చైనా విస్మరించిందని... ఇది చైనా చేసిన అతి పెద్ద తప్పు అని వ్యాఖ్యానించింది. భారతీయ మేధోసంపత్తిని పక్కన పెట్టి, అమెరికా, యూరప్ ల నుంచి వచ్చేవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రభుత్వ రంగ మీడియా గ్లోబర్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.