: కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్న స్మిత్... మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బౌన్సీ పిచ్ పై ఆడేందుకు రెండు జట్ల ఆటగాళ్లు తెగ శ్రమిస్తున్నారు. పిచ్ పై పడ్డ బంతి గింగిరాలు తిరుగుతూ దూసుకొస్తోంది. కొన్నిసార్లు అనూహ్యంగా పైకిలేస్తూ, ఇంకొన్నిసార్లు పాదం ఎత్తులో దూసుకొస్తోంది. ఇలా ఊహించని విధంగా వస్తున్న బంతిని ఆడేందుకు బ్యాట్స్ మన్ తికమకపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా బోల్తాపడగా, ఆసీస్ కెప్టెన్ భారత్ స్పిన్ ను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాడు. సహచరులకు స్పూర్తిగా నిలుస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. అతనికి జతగా రెన్ షా (13) ఆడుతున్నాడు. ఈ క్రమంలో తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో 28 ఓవర్లలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.