: శశికళ దెబ్బకు జైలు మారిన సైనేడ్ మల్లిక!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళను కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలుకు పోలీసులు తరలించారు. ఆమెకు ఓ గది కేటాయించారు. అయితే శశికళకు కేటాయించిన పక్క సెల్‌లోనే పలు హత్యలు చేసిన, అత్యంత కిరాతకురాలిగా పేరుమోసిన సైనేడ్ మల్లిక(52) ఉంటోంది. మల్లిక పలుమార్లు శశికళతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆమె గురించి తెలిసిన శశికళ భయంతో వణికిపోయారు. దీంతో ఆమెను మరోచోటికి మార్చాల్సిందిగా పలుమార్లు జైలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. స్పందించిన అధికారులు సైనేడ్ మల్లికను బెంగళూరు నుంచి బెల్గాం జైలుకు మార్చారు. ఆమెను తరలించడంతో శశికళ ఊపిరి పీల్చుకున్నారు.