: అత్త ఆస్తులు అమ్మి జరిమానా కడతా!: జయలలిత మేనల్లుడు దీపక్ ప్రకటన


తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ మరో ట్విస్టు ఇచ్చాడు. ఇప్పటికే పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం తనతో పాటు తన సోదరి దీపకు చెందుతుందని ప్రకటించిన దీపక్... తన అత్తకు సంబంధించిన స్థిరాస్తుల్లో కొన్ని అమ్మి, అక్రమాస్తుల కేసులో న్యాయస్థానం విధించిన 100 కోట్ల రూపాయల జరిమానా కడతానని ప్రకటించాడు.

అలాగే, తన అత్త అన్ని అస్తులకు తనతోపాటు తన సోదరి దీప వారసురాలని ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన సర్వహక్కులు తమవేనని తెలిపాడు. ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈమేరకు తెలిపాడు. అత్త ఆస్తులన్నింటినీ చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుంటానని దీపక్ తెలిపాడు. దీంతో తమిళనాట పెను కలకలం రేగుతోంది. నిన్నటి వరకు శశికళకు మద్దతిచ్చిన దీపక్ అకస్మాత్తుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అక్కడ ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News