: ఉగ్రవాదుల అధీనంలో ఉన్న విమానాశ్రయంలోకి దూసుకెళ్లిన సైన్యం
అమెరికా సంకీర్ణ దళాలతో కలిసి ఇరాకీ సైన్యం తమ దేశంలో ఉన్న ఉగ్రవాదులను హతమార్చేందుకు భారీ ఆపరేషన్‌ను మొదలుపెట్టి జిహాదీలను అంతమొందిస్తోన్న విషయం తెలిసిందే. ఆ విధంగా ఇస్లామిక్ స్టేట్ అధీనంలో ఉన్న పలు ప్రాంతాలను ఇప్పటికే తిరిగి స్వాధీనం చేసుకున్న దళాలు ప్రస్తుతం మోసుల్‌కు దక్షిణ దిశలో జిహాదీల అధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టుని స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఫెడరల్ పోలీస్, హోం మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత ర్యాపిడ్ రెస్పాన్స్ దళాలు భారీ ఎత్తున మోటార్లను కుమ్మరిస్తూ ఆ ఎయిర్‌పోర్టు వైపుకి దూసుకెళ్ళాయి. పైనుంచి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు దారి చూపుతూండగా, సైనిక దళాలు ప్రవేశిస్తున్నాయి. ఈ రోజు విమానాశ్రయంలోకి పూర్తిగా ప్రవేశించి పోరాటం జరుపుతామని సంబంధిత అధికారులు తెలిపారు.