: జియో వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం!
రిలయన్స్ జియో వల్ల ఇతర టెలికాం కంపెనీలకే కాకుండా, ప్రభుత్వానికి కూడా భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోంది. నిర్దేశించిన సమయానికి మించి ఉచిత డేటా, ఉచిత వాయిస్ సర్వీసులను అందిస్తుండటంతో టెలికాం సెక్టార్ నష్టపోతోంది. జియో ఆఫర్ తో దిగ్గజ కంపెనీలు ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ లు సైతం తమ కస్టమర్లను కాపాడుకోవడానికి రేట్లు భారీగా తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో, ఆయా కంపెనీల రెవెన్యూలకు భారీగా గండి పడింది. కంపెనీలకు ఆదాయం తగ్గడంతో, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 685 కోట్లను నష్టపోయిందని టెలికాం కమిషన్ తెలిపింది. టెలికాం సంస్థల రెవెన్యూలు మరో 10 శాతం వరకు క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.