: ఆ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లతో కోహ్లీని మాత్రమే పోల్చగలం: షేన్ వార్న్
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో నంబర్ వన్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనేనని ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కొనియాడారు. సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కంటే కోహ్లీనే గొప్ప ఆటగాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ గణాంకాలని నమోదు చేసుకున్నాడని, అవే ఆయనను అగ్రస్థానంలో నిలిపాయని చెప్పాడు. పరుగుల వరద పారిస్తూ కోహ్లీ దూసుకుపోతున్నాడని చెప్పాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వీవ్ రిచర్డ్స్, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌తో కోహ్లీని మాత్రమే పోల్చగలమని చెప్పాడు. తాను కోహ్లీకి పెద్ద అభిమానినని అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ చూడటం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. విరాట్ ఒక భిన్నమైన ఆటగాడని అన్నాడు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న ఈ సిరీస్ లో టీమిండియానే ఫేవరెట్ అని అన్నాడు.