: ఫేస్ బుక్, వాట్సప్ లపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు
సోషల్ మీడియా యాప్‌లు ఫేస్ బుక్, వాట్సప్‌లలో అందిస్తోన్న ఇంటర్నెట్ కాల్స్‌ను రెగ్యులేటరీ కిందకి తీసుకురావాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. వీడీ మూర్తి అనే వ్యక్తి దాఖలుచేసిన ఈ పిల్‌ను విచారించిన న్యాయస్థానం ఈ విషయంపై తమ స్పందన తెలపాలని సర్కారుని ఆదేశించింది. పిటిషనర్ పేర్కొన్న అంశాలపై ఆరు వారాల్లోగా అఫిడివిట్లు దాఖలు చేయాలని పలు ప్రభుత్వ శాఖలకు సూచించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను మే 3న చేపట్టనున్నట్టు చెప్పింది. సదరు సామాజిక మాధ్యమాల్లో ఈ నియంత్రణ లేని కార్యకలాపాలు దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేగాక, ప్రజా ఖజానాకు భారీగా నష్టాలు చేకూరుస్తాయని తెలిపారు.