: రోజా తన పద్ధతిని మార్చుకోవాలి: పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీజీపీ సాంబశివరావు బానిసలా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. డీజీపీపై రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు చెప్పారు. రోజా వ్యాఖ్యానించినట్టు పోలీసులు ఎవరికీ బానిసలు కారని... కేవలం చట్టానికి మాత్రమే బానిసలని అన్నారు. రోజా వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా రోజా నియంత్రణ పాటించాలని సూచించారు. మహిళల సదస్సును రోజా చెడగొడతారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని... అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News