: వరంగల్ లో సందడి చేసిన సాయి ధరమ్ తేజ్


మెగా హీరో సాయిధరమ్ తేజ్ విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలో అతను నటించిన 'విన్నర్' సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ బాలీవుడ్ స్టైల్ లో 'విన్నర్' ప్రమోషన్ మొదలుపెట్టాడు. అందులో భాగంగా వరంగల్ లో సాయిధరమ్ తేజ్ సందడి చేశాడు. అతనితోపాటు సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని, సంగీత దర్శకుడు తమన్ కూడా ఉన్నారు. వరంగల్ హన్మకొండలోని చైతన్య జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సాయిధరమ్ తేజ్ సమాధానాలు ఇచ్చాడు. సినిమా అద్భుతంగా వచ్చిందని, యువకులంతా సినిమా చూసి ఆదరించాలని కోరాడు. అభిమాన నటుడు కళాశాలలో సందడి చేయడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకపోయాయి. కేరింతలతో 'విన్నర్' సినిమా సభ్యులను విద్యార్థులు ఉత్సాహపరిచారు. 

  • Loading...

More Telugu News