: లైంగిక వేధింపుల ఆరోపణలతో రాజీనామా చేసిన బీహార్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు


బీహార్‌ మాజీమంత్రి, కాంగ్రెస్‌ నేత కుమార్తెపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు బ్రిజేశ్‌ పాండే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వ‌చ్చాయి. దీంతో సీఐడీ మహిళా విభాగం అధికారులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసి, దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. దీంతో బ్రిజేశ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. బ్రిజేశ్‌ సెక్స్‌ రాకెట్‌ని నడుపుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. అంతేగాక త‌న‌పై ప్రియదర్శిని అనే మహిళ, ఆమె సోదరుడు, బ్రిజేశ్ ముగ్గురూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. బ్రిజేశ్‌ తనను ఎన్నో సార్లు బెదిరించాడని పేర్కొన్నారు.

బ్రిజేశ్ పాండే త‌మ‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి ఫ్యాక్స్‌ ద్వారా లేఖను పంపిస్తూ త‌న‌ వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడకూడదని, అందుకే రాజీనామా చేస్తున్నాన‌ని, త‌న‌పై ఎవరో కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News