: ఎల్లుండి నుంచి లండన్ లో పర్యటించనున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత
లండన్‌లో జరగనున్న కామన్ వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్ సదస్సుకు రావాలని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందించింది. ఈమేరకు ఆమె ఈ నెల 24 నుండి 27 వరకు లండన్‌లో పర్యటించనున్నారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపు, లింగ వివక్ష నిర్మూలన, మహిళల రాజకీయ సాధికారత, విద్య వంటి పలు అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. సదస్సులో కవిత ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో మహిళా పాలసీల రూపకల్పన అంశాలపై సెమినార్లు కూడా ఉంటాయి. ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం కవిత లండన్ లో పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.