: ఐపీఎల్ కు న్యాయం చేసేందుకు వన్డే టోర్నీకి డుమ్మా కొట్టనున్న స్టోక్స్


ఐపీఎల్ లో భారీ ధర పలికిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ టోర్నీకి న్యాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం జాతీయ జట్టు తరపున ఆడాల్సిన రెండు వన్డేలను వదులుకోనున్నాడు. దీంతో ఐపీఎల్ మొత్తానికి అందుబాటులో ఉండడం ద్వారా భారీ మొత్తం వెచ్చించి కోనుగోలు చేసిన ఫ్రాంఛైజీకి ఆడనున్నాడు. కాగా, రెండు రోజుల క్రితం ముంబైలో జరిగిన వేలంలో పూణే సూపర్ జెయింట్స్ జట్టు 14.5 కోట్ల రూపాయలు వెచ్చించి బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్ కు ఆడనున్న జోస్ బట్లర్, కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడనున్న క్రిస్ వోక్స్ కూడా అందుబాటులో ఉండనున్నారు. పంజాబ్ ప్లేయర్, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, గుజరాత్ ఆటగాడు జాసన్ రాయ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు శామ్ బిల్లింగ్స్ రెండు వన్డేల ఇంగ్లండ్ టూర్ ముగిసిన తరువాతే ఐపీఎల్ జట్లతో కలవనున్నారు. 

  • Loading...

More Telugu News