: ఘోర రోడ్డు ప్రమాదం.. అనంతపురం జేఎన్టీయూ వీసీ, పీఏ, కారు డ్రైవర్ మృతి


అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఎం.ఎం. సర్కార్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో వున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం నుంచి కర్నూలు వెళ్తుండగా పామిడి జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో వుండగా, ఎదురుగా వస్తున్న లారీ వీసీ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం జేఎన్టీయూ వీసీ సర్కార్, ఆయన పీఏ ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాద్ మృతి చెందారు. దీంతో జేఎన్టీయూలో విషాదం నెలకొంది. 

  • Loading...

More Telugu News