: అమెరికాలోని 3 లక్షల మంది ఎన్నారైలు ఇండియాకు తిరిగి రాక తప్పదు!


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ కనీసం 3 లక్షల మంది ఎన్నారైలపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తగిన పత్రాలు లేకుండా, ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికాలో ఉంటున్న దాదాపు కోటి మందికి పైగా వలసదారులను వాళ్లవాళ్ల దేశాలకు తిప్పి పంపేయాలన్న ట్రంప్ నిర్ణయంతో మన ఎన్నారైలు బెంబేలెత్తుతున్నారు. దాదాపు 3 లక్షల మంది భారతీయులు సరైన పత్రాలు లేకుండానే అమెరికాలో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు సమాచారం. కొత్త నిబంధనలతో వీరందరికీ ముప్పు తప్పదు. వీరంతా తప్పకుండా ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి తలెత్తబోతోంది.

అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారిని ఇకపై ఎంత మాత్రం ఉపేక్షించబోమని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసే అధికారం తమ శాఖ సిబ్బందికి ఉంటుందని తెలిపింది. ఇప్పటిదాకా నేరస్తుల మీదే దృష్టి పెడుతున్నామని... ఇకపై అక్రమంగా ఉన్న అందరిపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News