: భావన కేసులో కొత్త ట్విస్టు...నటుడి ఇంట్లో నిందితుడు?


ప్రముఖ సినీ నటి భావన లైంగిక వేధింపుల కేసులో పలు మలుపులు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో మలయాళ సినీ పరిశ్రమలోని ఇతరుల ప్రమేయంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా మరో నిందితుడు కొచ్చి కక్కనాడ్ లోని ఓ ఫ్లాట్ లో దాక్కుని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫ్లాట్ మలయాళ యువ నటుడిదని తెలుస్తోంది. దీంతో అరెస్టైన నిందితుడికి నటిపై దాడి కేసులో నేరుగా సంబంధాలు ఉంటే, తన ఫ్లాట్ లో అతనికి ఆశ్రయం ఇచ్చిన యువ నటుడు కూడా నిందితుడే అవుతాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

అదుపులోకి తీసుకున్న నిందితుడి వివరాలను పోలీసులింకా వెల్లడించలేదు. అయితే ఈ కేసులో కీలక విషయాలన్నీ విశ్లేషిస్తే...మాలీవుడ్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. భావన ప్రయాణ వివరాలు ఇతరులకు ఎవరికీ తెలిసే అవకాశం లేదు. సినిమా యూనిట్ కు సంబంధించిన వారికి, ఆమె డేట్స్ చూసే వారికి మాత్రమే ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని ప్రధాన వ్యాపకం...అశ్లీల సమాచారాన్ని సినీ పెద్దలకు చేరవేయడమే. దీంతోనే అతనికి సినీ పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ లోని నలుగురు సభ్యుల సాయంతో పల్సర్ సునీల్ ఆమెపై దారుణానికి తెగబడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా యూనిట్ లోని నలుగురు సభ్యులపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News