: ఢిల్లీలో కాలేజీ ప్రొఫెసర్లను కొట్టిన ఏబీవీపీ కార్యకర్తలు
ఢిల్లీలోని రాంజాస్ కాలేజ్ లో ఏబీవీపీ విద్యార్థి సంఘం, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రాంజాస్ కాలేజీలో జరిగే సెమినార్ లో మాట్లాడేందుకు జేఎన్యూకు చెందిన ఉమర్ ఖలీద్ ను ఇంగ్లీష్ విభాగం ఆహ్వానించింది. దీనిని ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలో ప్రొఫెసర్ ప్రసన్న చక్రవర్తిని, మరో ఇద్దరు ప్రొఫెసర్లను ఏబీవీపీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు.
గతంలో పలు సందర్భాల్లో ప్రొఫెసర్ చక్రవర్తి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంపై విమర్శలు కురిపించారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న ఏబీవీపీ కార్యకర్తలు ఈ రోజు భౌతిక దాడికి దిగారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈలోగా ఇతర విద్యార్ధి సంఘాల నేతలు, ఏబీవీపీ వారితో తలబడ్డారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆయా విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ గూండాలపై చర్యలు తీసుకోవాలంటూ కమ్యూనిస్ట్ పార్టీల అనుబంధ సంఘాల విద్యార్థులు నినాదాలు చేస్తూ పోలీసు స్టేషన్ కు ర్యాలీ నిర్వహించారు.