: తహసీల్దారు ఇంట్లో కట్టలు కట్టలుగా కొత్త నోట్లు.. ఇంటినే అక్రమార్జనకు కార్యాలయంగా మార్చిన వైనం
విశాఖపట్నంలోని భీమిలి తహసీల్దారు రామారావు విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్న ఏసీబీ అధికారులు అక్కయ్యపాలెంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఆయన ఇంట్లో దొరికిన కొత్త నోట్ల కట్టలను చూసి అధికారులు షాక్ అయ్యారు. ఆయన ఇంట్లో మొత్తం రూ.41 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేగాక ఆయనకు హైదరాబాద్ నగరంలో రెండు ప్లాట్లు, విశాఖలో రెండు వాణిజ్య భవనాలు, రెండు ప్లాట్లు, కిలో బంగారం, అక్కయ్యపాలెంలో రెండంతస్తుల భవనం ఉన్నట్లు అధికారులు చెప్పారు. తహసీల్దార్ రామారావు తన అక్రమ సంపాదనకు కేంద్రంగా తన ఇంటిని మార్చేశారు. పట్టాదార్ పాస్ పుస్తకాల జారీకి ఇంట్లోనే కార్యాలయం తెరిచారు.