: హైదరాబాద్ లో పలుచోట్ల ఉద్రిక్తతలు... ఓయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం


హైదరాబాద్ నగరంలో ఈ రోజు త‌ల‌పెట్టిన‌ నిరుద్యోగుల నిరసన ర్యాలీ నేప‌థ్యంలో ప‌లుచోట్ల ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. తార్నాక‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కళాశాల, ఎన్‌సీసీ గేటు వద్ద విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఓయూ లా కళాశాల వద్ద ఒక కారు అద్దాలను పగులగొట్టారు. ఈ నేప‌థ్యంలో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌రోవైపు ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల ఎదుట సందీప్ చ‌వాన్ అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అత‌డిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అరెస్టులకు నిరసనగా రేపు విద్యా సంస్థల బంద్‌కు ఓయూ ఐకాస పిలుపునిచ్చింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న నాయకులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి నాయ‌కులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News